విద్యార్థుల ఆందోళనకు శ్రీకాంత్ రెడ్డి మద్దతు

వైయస్సార్ జిల్లా(గాలివీడు): జిల్లాలోని చిన్నమండ్యంలలో ఎత్తివేసిన బీసీ హాస్టళ్లను పునరుద్ధరించాలని కోరుతూ రాయచోటిలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. రాయచోటి తహశీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీ తీశారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులకు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మద్దతు తెలిపారు. విద్యార్ధుల సమస్యలపై పభుత్వంతో పోరాడతామని అన్నారు. 

Back to Top