ఘనంగా ఎమ్మెల్యే సాయి జన్మదిన వేడుకలు

ఆధోని అర్బన్‌: ఆధోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వ‌హించారు. ఎమ్మెల్యే సాయిప్ర‌సాద్‌రెడ్డి శాసన సభ సమావేశాలలో ఉన్నందున ఆయన తనయుడు మనోజ్ కుమార్‌రెడ్డి కేక్‌ కట్‌ చేసి తండ్రి జ‌న్మ‌దిన వేడుక ప్రారంభించారు. మనోజ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మ‌హిళ‌లు, చిన్న పిల్లల ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు పండ్లు, బ్రెడ్డు అందజేశారు. అదేవిధంగా ఆస్పరి రోడ్డులోని జీవనజ్యోతి అనాథాశ్రమంలో వైయ‌స్‌ఆర్‌ సాయి యూత్, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. తన తండ్రి సాయి జన్మదిన వేడుకలను సన్నిహితులు, అభిమానుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని మనోజ్‌కుమార్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ అభిమానం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. వైయ‌స్ఆర్ సీపీ పట్టణ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి మాట్లాడుతూ సాయన్న ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు.
Back to Top