జగనన్న పేరు వింటే నారావారి న రాల్లో కలవరం

చిత్తూరు: నగరిలో వైయస్‌ జగనన్న పేరు వింటే అక్కడ నారా వారి నరాల్లో కలవరం పుట్టాలని ఎమ్మెల్యే రోజా నినదించారు. ఇడుపులపాయలో మొదలుపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ నేతల గుండెల్లో గుణపంలా దిగుతుందన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వడమాలపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రోజా ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ఈ రోజు ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే అని, ప్రజల పక్షాన పోరాడే నాయకుడు ఒక్క జగనన్న మాత్రమే అన్నారు. సూర్యుడు తూర్పున ఉదయిండం ఎంతో వైయస్‌ జగన్‌ సీఎం కావడం అంతే సత్యమన్నారు. పాదయాత్రగా వైయస్‌ జగన్‌ నడిచి వస్తుంటే ఆయన  అడుగులో అడుగు వేస్తూ నడిచి రావడం మనందరి అదృష్టమన్నారు. వైయస్‌ఆర్‌ చరిత్ర ఒక చరిత్ర అయితే..వైయస్‌ జగన్‌ పాదయాత్ర కూడా అంతే చరిత్ర అన్నారు. వైయస్‌ జగన్‌ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో? మా ప్రాంతం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ రోజు  వైయస్‌ఆర్‌ రైతు బాంధవుడిగా ఈ ప్రాంతంలో గాలేరి నగరి పనులు ప్రారంభించారన్నారు. ఫేజ్‌–1, ఫేజ్‌–2ను వైయస్‌ఆర్‌ ఎంతో ఖర్చు చేసి పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ఈ జిల్లాలో పుట్టి గాలేరు–నగరి పూర్తి చేయలేదంటే ఆయన ఈ జిల్లాలో పుట్టినందుకు మనమంతా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందన్నారు. మనసు లేని ముఖ్యమంత్రి చంద్రబాబు అని విమర్శించారు. గాలేరు–నగరి సాధనకు తాను పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ ప్రారంభించిన ఈ ప్రాజెక్టును వైయస్‌ జగనన్న ప్రారంభిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా జిల్లాలోని షుగర్‌ ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయని మండిపడ్డారు. మూతపడిన ఈ ఫ్యాక్టరీలను దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తెరిపించారన్నారు. మళ్లీ చంద్రబాబు సీఎం కాగానే ఈ రెండు ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, మరో ఏడాదిలో మన జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, వాటిని తెరిపిస్తారని ధైర్యం చెప్పారు. చంద్రబాబు ఇవాళ కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రోడ్డున పడేశారని, ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. జాబు రావాలంటే బాబు పోవాలని ఆమె నినదించారు. వార్డు మెంబర్‌గా కూడా గెలువలేని తన కుమారుడిని మాత్రం ఇవాళ మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. నన్ను నమ్మి ఎమ్మెల్యేను చేసిన వైయస్‌ జగన్‌కు, నన్ను ఎన్నుకున్న ప్రజలకు రుణపడి ఉంటానని, రాజన్న రాజ్యం వచ్చే వరకు జగనన్న వెంటే ఉంటానని జనం సాక్షిగా రోజా స్పష్టం చేశారు. నియోజకవర్గంలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని రోజా కోరారు.
 
Back to Top