టీడీపీ టిప్పర్లతో ప్రాణాలు తీస్తున్న పట్టించుకోరా?

ఎమ్మెల్యే రోజా
చిత్తూరు: టీడీపీ నాయకులు టిప్పర్లతో ప్రాణాలు తీస్తున్న పట్టించుకోరా అని ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. అక్రమ బ్లాస్టింగ్‌లపై గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, విచారణ జరిపించాలని నాడు కలెక్టర్, తహశీల్దార్‌కు చెప్పామన్నారు. ఆ తహశీల్దార్‌ను టీడీపీ నేతలు వేయించుకున్నారని, అక్రమ క్వారీలకు అండగా నిలిచారని విమర్శించారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఓ ప్రాణం పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
Back to Top