ఎన్టీఆర్‌ కంటే ఘోరమైన వెన్నుపోటు

చివరి బడ్జెట్‌లో కూడా మహిళలకు అన్యాయం
డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశాడు
వడ్డీలేని రుణాలకు రూ. 1460 కోట్లు ఏమూలకు సరిపోతుంది
చంద్రబాబు మహిళా వ్యతిరేకి
పండంటి పథకం, మహాలక్ష్మీ పథకం అమలు చేశారా?
నారా భువనేశ్వరి, బ్రహ్మణి బినామీ మహిళలు
బాబు దోచుకున్న డబ్బుతో వారి వ్యాపారం
మహిళా కోటలో లోకేష్‌కు మంత్రి పదవి
మహిళా రక్షణకు ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు లేకపోవడం సిగ్గుచేటు
టీడీపీ హయాంలో దుర్యోధన, దుశ్యాసన, దుర్మార్గపు పాలన
మహిళా లోకం ఏకమై బాబుకు తగిన గుణపాఠం చెప్పాలి
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళలను చంద్రబాబు వెన్నుపొడిచాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. డ్వాక్రా రుణాలు మాఫీ, వడ్డీలేని రుణాలు, మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఆఖరి బడ్జెట్‌ కూడా మహిళలను మోసం చేసే విధంగా ఉందన్నారు. ఏపీలో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై రోజా మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రోజా ఏం మాట్లాడారో.. ఆమె మాటల్లోనే...
మేనిఫెస్టోలో క్లీయర్‌గా చెప్పారు. డ్వాక్రా మహిళలకు అసలు, వడ్డీతో సహా పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీకి రూ. 14,200 వేల కోట్లు కావాలి. ఇచ్చిన మాటను చివరి బడ్జెట్‌లో కూడా నెరవేర్చకపోవడం దుర్మార్గం. చంద్రబాబు కేటాయించింది రూ.17 వందల కోట్లు క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌ కింద. అవి మహిళలు మళ్లీ తిరిగి కట్టాలి. రూ. 17 వందల కోట్లలో డ్వాక్రా మహిళలకు ఏమైనా ఉపయోగం ఉందా..? రూ. 1460 కోట్లు వడ్డీలేని రుణాలకు కేటాయించామంటున్నారు. రూ. 24 వందల కోట్లు వడ్డీలేని రుణాలకు బాకీ పడివుంటే కేవలం రూ.1460 కోట్లు ఇస్తే అది ఏ మూలకు సరిపోతుంది. రాబోయే సంవత్సర కాలంలో వడ్డీలేని రుణాలు ఎత్తివేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది. 

బెల్ట్‌షాపులను దశల వారిగా ఎత్తేస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా జాతీయ రహదారుల వద్ద విచ్చల విడిగా మద్యం దుకాణాలు పెట్టి దోచుకుంటున్నారు. 
కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోయారు. మహిళల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతున్నా పట్టించుకోని చంద్రబాబును ఏం చేయాలో మహిళలు ఆలోచించుకోవాలి. 

మహాలక్ష్మి పథకం అని ఆడపిల్ల పుడితే రూ. 30 వేలు వేస్తామని చంద్రబాబు గొప్పగా చెప్పాడు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్క ఆడపిల్ల పుట్టినట్లు అయినా నమోదు చేశారా..? ఒక్కరికైనా రూ. 30 వేలు ఇచ్చారా అంటే శూన్యం. ఆడపిల్ల లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తే ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా అర్థం అవుతుంది. చంద్రబాబు మహిళా వ్యతిరేకి. మహిళలకు మేలు చేసేందుకు బాబుకు చేతులు రావు. పండంటి పథకం కింద గర్భిణులకు రూ. 10 వేలు ఇస్తామన్నారు. నాలుగేళ్లుగా వారికి ఇవ్వకపోగా చివరి బడ్జెట్‌లో కూడా కేటాయించలేదు. 

కళాశాల స్థాయి విద్యార్థినులకు ఐప్యాడ్‌లు, మహిళలకు సెల్‌ఫోన్‌లు, పాఠశాల విద్యార్థునులకు సైకిల్స్‌ కొనిస్తానన్నారు. కానీ ఈనాడు పత్రికల్లో శానిటరీ ప్యాడ్స్‌పై 50 శాతం రాయితీ ఇస్తామన్నారు. చంద్రబాబుకు ఐప్యాడ్స్‌కు, శానిటరీ ప్యాడ్స్‌కి తేడా తెలియదేమో. పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించే ప్రయత్నం చేస్తానన్నాడు. నాలుగేళ్లుగా బీజేపీతో పొత్తుపెట్టుకుని ఏ రోజైనా మహిళా బిల్లు గురించి పార్లమెంట్‌లో మాట్లాడారా? కేవలం ఓట్ల కోసం మహిళలను మోసం చేయడానికి మేనిఫెస్టోలో పెట్టారు. 

ప్రపంచ మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు చేసిన ట్విట్‌ మహిళా సాధికారతకు మా ఇళ్లే ఒక ఉదాహరణ అని చెప్పారు. సేవా రంగంలో 24 గంటలు నేను బిజీగా ఉంటాను. వ్యాపారాన్ని నా భార్య సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇప్పుడు మా కోడలు కూడా వ్యాపారం చూసుకుంటున్నారు. నేను మా అబ్బాయి ఆర్థికంగా వారిపై ఆధారపడుతున్నామంటే అర్థం చేసుకోండి వారి సమర్థత. మహిళల పట్ల చంద్రబాబు ఎంత చౌకబారుతనంగా ఉన్నాడో అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లు వ్యాపారాలు చేస్తే మహిళా సాధికారత సాధించినట్లేనా? 

పేదవారికి ఇల్లు కటిస్తానంటాడు. ఆయన హైదరాబాద్‌లో రూ. కోట్లు పెట్టుకొని ఇల్లు కట్టుకొని అందరికీ కట్టించినట్లుగా ఫీలవుతాడు. తన కొడుకు మంత్రి పదవి ఇచ్చి రాష్ట్రమంతా ఉద్యోగాలు ఇచ్చినట్లు సంతోషపడుతుంటాడు. బినామీ మహిళలు భువనేశ్వరి, బ్రహ్మణి చంద్రబాబు దోచుకున్న డబ్బుతో వ్యాపారం చేయిస్తూ వారి ఇంట్లో సాధికారత వచ్చిందని, రాష్ట్రమంతా వచ్చిందని చెప్పుకోవడం సిగ్గుచేటు. 
మీ కేబినెట్‌లో ఇద్దరు మహిళా మంత్రులను తీసేసి అమ్ముడుపోయి వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చి అదే మహిళా సాధికరత అనుకుంటే ఎలా? మహిళా కోటాలో లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడం సాధికారతా?  

మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు మహిళలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తున్నారో అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. మహిళా పరిరక్షణకు ప్రత్యేక పోలీస్‌ విభాగం ఏర్పాటు చేసే ప్రతిపాదన పోలీస్‌ విభాగం వద్ద ఉందా అంటే హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప లేదని చెప్పారు.  ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రక్షణ కోసం ప్రత్యేక పోలీస్‌ విభాగం ఏర్పాటు చేస్తానని చెప్పారు. అది చేశారా..? రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే మహిళల అక్రమ రవాణాలో ఏపీ 2వ స్థానంలో ఉందంటే.. మహిళల భద్రత ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది. రాష్ట్రంలో దుర్వోధన, దుశ్యాసన, దుర్మార్గపు పాలన సాగుతుంది. టీడీపీ గుండాలు, రౌడీలు ఏ విధంగా మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారో అర్థం అవుతుంది. వనజాక్షి విషయంలో ఏం న్యాయం చేశారు. ఓటుకు కోట్ల కేసులు చంద్రబాబు అడ్డంగా దొరికిపోతే ఐఏఎస్‌ అనురాధను బదిలీ చేశారు. పెందుర్తిలో బండారు అనుచరులు ఎస్సీ మహిళలపై వివస్త్రను చేసి దాడి చేస్తేం ఏం చేశారు. ఇంత వరకు తప్పు చేసిన వారిని దండించారా..? కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో ఒక మహిళలను వివస్త్రను చేసి దాడి చేసి వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టినా యాక్షన్‌ తీసుకోలేదంటే బాబుకు మహిళా సంక్షేమంపై ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. నడి రాత్రి కాదు.. పట్టపగలే మహిళలు రోడ్లపై తిరిగలేని పరిస్థితిని చంద్రబాబు కల్పించారు. మహిళా లోకం అంతా ఏకమై చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలి. 
Back to Top