జగనన్నను సీఎం చేద్దాంచిత్తూరు: మన సమస్యలు పరిష్కారం కావాలంటే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని ఎమ్మెల్యే రోజా అన్నారు. నగరి నియోజకవర్గంలోని తోరురు గ్రామంలో ఎమ్మెల్యే రోజా పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు సర్కార్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలా మోసం చేస్తుందో ఎమ్మెల్యే రోజా ప్రజలకు వివరించారు. ఆమె మాట్లాడుతూ..దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న‌లో అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందేవ‌న్నారు. టీడీపీ పాలనలో నిజమైన పేదవాళ్లకు పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. చంద‌న్న కానుక‌ల పేరుతో టీడీపీ నేత‌లు దోచుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. టీడీపీకి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని, చంద్ర‌బాబుకు బుద్ధి చెబుదామ‌ని, ఈ సారి  వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకుందామని, మన సమస్యలు పరిష్కరించుకుందామని రోజా సూచించారు.
 

Back to Top