గాలేరు-న‌గ‌రి ప్రాజెక్టుపై ప్ర‌భుత్వం స్పందించాలి

 
తిరుమల:  గాలేరు-న‌గ‌రి ప్రాజెక్టుపై ప్ర‌భుత్వం స్పందించాల‌ని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. న‌వంబ‌ర్ 28 నుంచి గాలేరు-న‌గ‌రి ప్రాజెక్టు సాధ‌న‌కు రోజా చేప‌ట్టిన పాద‌యాత్ర తిరుమ‌ల చేరుకుంది. శనివారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ... గాలేరు నగరి ప్రాజెక్ట్ సాధనకు 88 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు. రాయలసీమకు అన్యాయం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని రోజా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న పట్టిసీమ ద్వారా రాయలసీమకు చుక్కనీరు రాలేదని రోజా అన్నారు.
Back to Top