రాష్ట్రంలో దుశ్శాసన పాలనచిత్తూరు: రాష్ట్రంలో దుశ్శాసన పాలన సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. విశాఖ జిల్లా పెందుర్తిలో అధికార టీడీపీ నాయకులు రాక్షసంగా వ్యవహరించిన ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు.  సభ్యసమాజం తలదించుకునేలా టీడీపీ నేతలు వ్యవహరించారని రోజా మండిపడ్డారు. ఎన్‌టీఆర్‌ గృహ కల్ప పేరుతో ఆక్రమించుకునేందకు ప్రయత్నించగా అడ్డుకోవడంతో మహిళ దుస్తులు చింపేసి ఈడ్చడం బాధాకరమన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన టీడీపీ నేత అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. మహిళలంటే టీడీపీ నేతలకు ఇంత చిన్నచూపా అని ప్రశ్నించారు. మహిళలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

వైయస్‌ఆర్‌వి స్కీంలు..బాబువి స్కాంలు
వైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, చంద్రబాబువి అన్ని స్కాంలే అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రొద్దుటూరులో నిరాహారా దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆర్కే రోజా, అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. కృష్ణానది ఒడ్డున పెద్ద ఇల్లు కట్టుకున్న చంద్రబాబు పేదవాడికి ఇల్లు కట్టించాలనే ఆలోచన  రాకపోవడం దారుణమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అడిగిన ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టించారన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఆడబిడ్డల పేరుతో పక్కా ఇల్లు కట్టించి ఇస్తారని రోజా తెలిపారు.
 

తాజా ఫోటోలు

Back to Top