బాబు ప్యాకేజీ డ్రైనేజీలా ఉంది

 • వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలను అడ్డుకోమనడం దిగజారుడుతనం
 • చంద్రబాబును యువత తరిమికొట్టాలి
 • గుంటూరులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తగలబెట్టింది బాబే
 • వైయస్‌ఆర్‌ సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా
 • తిరుపతి: చంద్రబాబు తీసుకొచ్చిన ప్యాకేజీ డ్రైనేజీలా ఉంది కానీ ప్రజలకు ఉపయోగకరంగా లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సని ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలను అడ్డుకోండని పిలుపునివ్వడం బాబు దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు, ఆయన ఎంపీలు ప్రత్యేక హోదాను కేంద్రానికి ఎలా తాకట్టుపెట్టారని ప్రజలందరికీ తెలుసని రోజా వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రమంతా ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు మాత్రం ప్యాకేజీ మేలని ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. గత సంవత్సరం ఎంవోయూలకే దిక్కులేదు కానీ ఇప్పుడు రూ. 10 లక్షల కోట్ల ఎంవోయూలు కుదుర్చుకున్నామని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఫైరయ్యారు. ఆ ఎంవోయూలతో ఏ జిల్లాల్లో ఎన్ని పరిశ్రమలు పెట్టారో చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారు 3 సంవత్సరాల్లో 2 సార్లు సమ్మిట్లు జరిగాయి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారని నిలదీశారు. టీడీపీ కార్యాలయంలో, టీడీపీ విద్యార్థి, యువజన విభాగంలో ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించారా అని చురకంటించారు. కాలేజీలోని పీఆర్‌వోలు, జీడిపప్పు బ్రోకర్‌లు తప్ప వేరే ఎవరూ ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రాలేదా అని ప్రశ్నించారు. 
  బాబు చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేసే రాష్ట్ర పరువు మంటగలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తున్నాయంటూ విటలాచార్య సినిమా చూపుతూ హోదా ఉద్యమాన్ని చంద్రబాబు నీరుగారుస్తున్నారని రోజా మండిపడ్డారు. హోదా కోసం రాష్ట్ర మంతా ఉద్యమిస్తే 26వ తేదిన పోలీస్‌ బలంతో ప్రజాస్వామ్య స్వేచ్ఛను కాలరాశారని విమర్శించారు. ప్రజలు తమ కష్టాలను కూడా చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా పాలన చేస్తున్నారంటే ఎంత దౌర్భన్యం జరుగుతుందో ఆలోచించుకోవాలి. జాబు రాకుండా చేసిన రాష్ట్ర యువత అంతా బాబును తరిమికొట్టాలని ఆరోపించారు.

  హోదా కోసం రాజీనామాలకు సిద్ధం
  టీడీపీ నేతలే రాష్ట్రంలో నేరాలు చేస్తూ వాటిని వైయస్‌ఆర్‌ సీపీకి అంటించాలని చూస్తున్నారని ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని టీడీపీ నేతలే తగులబెట్టి దాన్ని వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై నెట్టి అధికార బలంతో పోలీసులతో అరెస్టు చేయిస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ను కించపరిచే అవసరం తమకు లేదని రోజా చెప్పారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డితో సమానంగా ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ఎన్టీఆర్‌ను చూస్తారన్నారు. ఎన్టీఆర్‌ ఫోటోలు పార్టీ ఆఫీస్‌ నుంచి తీసేసి స్టోర్‌ రూంలో పడేసిన చంద్రబాబే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తగలబెట్టివుంటారని అనుమానం వ్యక్తం చేశారు. హోదా కోసం రాజీనామా చేయడానికైనా వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని రోజా విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. మోడీతో హోదా విషయంతో తేల్చుకొని రాజీనామా చేస్తారన్నారు. హోదా కోసం వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతూనే ఉంటుందని, ఏ పార్టీ ముందుకు వచ్చిన వైయస్‌ జగన్‌ కలుపుకొని ముందుకుపోతారని స్పష్టం చేశారు.
Back to Top