ఏపీ బడ్జెట్‌ నిరాశజనకం

హైదరాబాద్‌: ఏపీ బడ్జెట్‌ అన్ని వర్గాలకు నిరాశజనకంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మహిళలకు బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది శూన్యమని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేటాయించిన రూ.1500 కోట్లతో డ్వాక్రా మహిళలకు ఏమైనా ఉపయోగంగా ఉన్నాయా అన్నారు.  వడ్డీలేని రుణాల మాఫీకి రూ,1460 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ఆమె ప్రశ్నించారు. టీడీపీలో మహిళలకు రక్షణ కరువైందని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. 
 
Back to Top