ఆడవాళ్లను మోసం చేసిన చంద్రబాబు

 
ఎమ్మెల్యే ఆర్కే రోజా
కర్నూలు:  ఆరేళ్ల అమ్మాయిల నుంచి అరవై ఏళ్ల ముసలావిడ వరకు అందర్ని చంద్రబాబు మోసం చేశారని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. మహిళా సదస్సును టీడీపీ అడ్డుకోవడం పట్ల రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె వైయస్‌ జగన్‌ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. హుశ్సేనాపురంలో తలపెట్టిన మహిళా సదస్సుకు ఎస్సీ మూడు రోజుల ముందే అనుమతించారన్నారు. అయితే టీడీపీ నేతలు కుట్రలు చేస్తూ మహిళలను సదస్సుకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఈ రోజు సదస్సుకు పెద్ద ఎత్తున హాజరవుతుండటంతో ఓర్వలేక టీడీపీ నేతలు ఎక్కడిక్కడే వాహనాలు ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో దుర్యోధన, దుశ్శాసన పాలన జరుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ఆమె అభివర్ణించారు.l2015– 2016లో రాష్ట్రంలో క్రైమ్‌ రేటు పెరిగిందని సాక్షాత్తు పోలీసు శాఖ నివేదికలే చెబుతున్నాయని గుర్తు చేశారు. చంద్రబాబు మహిళా వ్యతిరేకి అన్నారు. వనజాక్షి, రుషితేశ్వరి లాంటి మహిళలకు ఎలాంటి అవమానాలు జరిగాయో చూశామన్నారు. ఆడవాళ్ల కన్నీళ్లలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఏపీ క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులు అరాచక వ్యక్తులు ఉన్నారని, అలాగే అచ్చి, బుచ్చి, గాలి, దూళి, తోడేలు వంటి నేతలు ఎలా వ్యవహరిస్తున్నారో ఆలోచించాలన్నారు. వాళ్ల మీద చర్యలు చేపట్టాల్సిన చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. నారాయణ కళాశాలలో ఎంతో మంతి అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటే  వారిపే ఎలాంటి కేసులు లేవన్నారు. మహిళా వైయస్‌ఆర్‌సీపీకి ఓటు వేసిందని ఆమె భూములు లాక్కున్న పయ్యావుల కేశవ్‌కు ఇవాళ చీప్‌ విఫ్‌ పదవి కట్టబెట్టారన్నారు. రైతులు రుణాల కోసం తాళిబొట్లు తాకట్టు పెట్టారన్నారు. వారి బంగారం ఇంటికి తెస్తామన్న చంద్రబాబు మాట తప్పారన్నారు. మద్యం పాలసీనే ముఖ్యమంటూ చంద్రబాబు పాలన సాగిస్తున్నారని రోజా మండిపడ్డారు. ప్రతి ఇంటికి 20 లీటర్లు ఇస్తామన్న చంద్రబాబు ఇవాళ ప్రతి ఇంటికి మద్యం బాటిళ్లు పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రగా వస్తుంటే ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారని రోజా తెలిపారు. రైతులు 90 శాతం అప్పుల ఊబిలో చిక్కుకున్నారని తెలిపారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి దౌర్భగ్య పాలన సాగుతుందో అర్థమవుతుందన్నారు. ఆరేళ్ల అమ్మాయిల నుంచి అరవై ఏళ్ల ముసలావిడ వరకు అందర్ని మోసం చేశారని మండిపడ్డారు. సైకిల్‌ గుర్తుకు ఓట్లు వేస్తే సైకిళ్లు ఇస్తామని మాట తప్పారన్నారు. చంద్రబాబు అమరావతిలో ఉంటూ అక్కడే ఆడవాళ్లపై అరాచకాలు, అక్రమాలు జరుగుతున్నాయంటే అది ఆయన ఘనతే అన్నారు.  ఎన్ని కుట్రలు చేసినా మహిళా సదస్సు నిర్వహించి తీరుతామని హెచ్చరించారు.
 
Back to Top