చంద్రబాబు మానసిక స్థితి సరిగాలేదు


చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాన‌సిక స్థితి స‌రిగా లేద‌ని, ఆయ‌న ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదని  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. శుక్రవారం జిల్లాలోని పుత్తూరులో వైయ‌స్ఆర్‌సీపీ బూత్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మానసిక స్థితి సరిగాలేదని.. అందుకే నిన్నక‌ర్నూలు స‌భ‌లో ప్రతిపక్ష నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారు అనడాన్ని బట్టే అర్థమౌతుందన్నారు. మేము ఎప్పుడు అధికారంలో ఉన్నామో చెప్పాలని ప్రశ్నించారు.. బాబు మతి భ్రమంచి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అందుకే ఏంమాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదన్నారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకుని అన్నీ పదవులు అనుభవించారు. నేడు తన బినామీ ఏపీ ఎన్జీఓతో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయండని చెప్పించి ఆ తర్వాత లేదని అనడాన్ని బట్టే అర్థమవుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిని అమరావతికి పిలిపించి 36 రకాల వంటలు వడ్డించి మన్ననలు పోందటానికి చిన్న చంద్రబాబు(లోకేష్‌) ప్రయత్నించారని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. టీడీపీ నేత‌ల తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బుద్ధి చెబుతార‌ని హెచ్చ‌రించారు.

Back to Top