నేడు అసెంబ్లీ కి ఎమ్మెల్యే రోజా

హైద‌రాబాద్‌) శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ఎమ్మెల్యే రోజా ఈ ఉద‌యం హాజ‌రు అవుతున్నారు. ఉద‌యం 9 గంట‌ల‌కు స‌భ‌కు హాజ‌ర‌వుతున్నట్లు ఆమె వెల్ల‌డించారు. ప్రశ్నోత్త‌రాల కార్య‌క్ర‌మానికి ఇప్ప‌టికే నోటీసులు అందినందున‌, జీరో అవ‌ర్ లో ఆమె మాట్లాడే అవ‌కాశం రావచ్చు. నిన్న‌నే ఆమె కోర్టు ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శికి అందించారు.
 అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ఏడాదిపాటు తనను అన్యాయంగా సస్పెండ్ చేయడం వల్ల...నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లలేకపోయానని రోజా వాపోయారు. ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేసేవిధంగా సస్పెండ్ చేశారని అన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం రెట్టింపు అయ్యిందని, ఓ తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దేందుకు న్యాయవ్యవస్థ ఉంటుందని రోజా స్పష్టం చేశారు. 
Back to Top