నేను చ‌నిపోతే నా పిల్ల‌ల‌కు దిక్కెవ‌రు

 • మ‌హిళా స‌ద‌స్సుకు ఆహ్వానించి ఉద్దేశ్యపూర్వ‌కంగా అడ్డుకున్నారు
 • నా గ‌న్‌మెన్‌ను దించేశారు.. నా ప్రాణాల‌కు ర‌క్ష‌ణేదీ?
 • అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు నుంచి న‌న్ను వేధిస్తున్నారు
 • మా హ‌క్కుల్ని స్పీక‌రే హ‌రిస్తే ఎవ‌రికి చెప్పుకోవాలి
 • స్పీక‌ర్ కోడ‌లు ఆర్థ‌నాధాలే ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశా
 • మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించ‌డం త‌ప్పా?
 • ప్ర‌భుత్వానికి అనుకూలంగా మాట్లాడితే అవ‌కాశం ఇస్తామ‌ని డీజీపీ చెప్ప‌డం దారుణం
 • చంద్ర‌బాబు కోడ‌లు, వెంక‌య్య కూతురు గొప్ప‌వారా? 
 • వైయ‌స్ఆర్ మ‌గాడు..న‌న్ను ప్ర‌తిప‌క్ష నేత‌గా ఎప్పుడు చూడ‌లేదు
 • మీడియా స‌మావేశంలో ఆర్కే రోజా
 • హైద‌రాబాద్‌: చ‌ంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. తాను చ‌నిపోతే నా బిడ్డ‌ల‌కు దిక్కెవ‌ర‌ని ఆమె రోధించారు.  విజ‌య‌వాడలో జ‌రుగుతున్న మ‌హిళా పార్లమెంట్ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు ఎయిర్‌పోర్టులో అడ్డుకోవ‌డం ప‌ట్ల రోజా మండిప‌డ్డారు. తాను ఎమ్మెల్యే అయిన నాటి నుంచి కూడా చంద్ర‌బాబు క‌క్ష‌గ‌ట్టార‌ని, అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు నుంచి వేధిస్తున్నార‌ని రోధించారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర  కార్యాల‌యంలో రోజా మీడియాతో మాట్లాడారు. ఆమె ఎమ‌న్నారంటే..

  క్రైమ్ రేటు పెరిగిపోతున్న విజ‌య‌వాడ‌లో మ‌హిళా స‌ద‌స్సు పెట్టారు. అక్క‌డికి వెళ్లేందుకు తాను వెళ్తే ఒక ఉగ్ర‌వాదిలాగా త‌న‌ను నిర్బంధించారు. ఒక ఎమ్మెల్యేకే రాష్ట్రంలో ర‌క్ష‌ణ లేక‌పోతే..సామాన్యుల సంగ‌తేంటి. ప్ర‌జ‌ల డ‌బ్బుతో మ‌హిళా స‌ద‌స్సు నిర్వ‌హిస్తూ ప్ర‌జాప్ర‌తినిధినైనా న‌న్ను పాల్గొన‌కుండా అడ్డుకోవ‌డం దుర్మార్గం. ఎందుక‌య్య చంద్ర‌బాబు, స్పీక‌ర్ గారు.. తానంటే భ‌యం. ప్ర‌తిప‌క్షం ఎప్పుడు కూడా ప్ర‌భుత్వం చేసే త‌ప్పులు ఎత్తి చూపుతుంది. అసెంబ్లీలో మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై తాను మాట్లాడుతుంటే అడ్డుకున్నారు. కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్‌లో మ‌హిళ‌ల‌ను వ్య‌భిచారంలోకి దింపుతుంటే ఆ విష‌యంపై తాను ప్ర‌శ్నించాన‌ని రూల్స్‌కు విరుద్ధంగా ఏడాది పాటు స‌స్పెండ్ చేశారు. ఈ రోజు మ‌హిళా స‌ద‌స్సులో తాను పాల్గొంటే ఎక్క‌డ మ‌హిళా స‌మ‌స్య‌లపై మాట్లాడుతాన‌ని అడ్డుకున్నారు. స్పీక‌ర్ త‌న కోడ‌లితో వ్య‌వ‌హ‌రించిన తీరుపై వీడియో ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తే త‌ప్పా?..ఇంట్లో కోడ‌లు ఆర్థ‌నాధాలు, అమ‌రావ‌తిలో మాత్రం నీతులు మాట్లాడుతున్నారు. రెండు రోజుల క్రితం స్పీక‌ర్ మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా కారు షెడ్‌లో ఉండాలి. మ‌హిళ‌లు ఇంట్లో ఉండాల‌ని వ్యాఖ్యానించ‌డం బాధాక‌రం. న‌న్ను మ‌హిళా స‌ద‌స్సుకు పిలిచి ఎయిర్‌పోర్టులో ఎందుకు అడ్డుకున్నారు. నాకు రెండు ఆహ్వానాలు  ఎందుకు పంపించారు. నేను రాక‌పోతే మ‌హిళా స‌మ‌స్య‌లు ఈవిడ‌కు ప‌ట్ట‌వా అని విమ‌ర్శించేవారు. ఈ రోజు అక్క‌డ మాట్లాడిన మాట‌లు, ఫైట్ల‌లో తెప్పించుకొని పొగిడించుకుంటున్నారు. ఒక్క బాధితురాలినైనా ఆ స‌ద‌స్సుకు పిలిచి మాట్లాడించి ఉంటే ఆ స‌ద‌స్సుకు అర్థం ఉంటేది. ఒక వ‌న‌జాక్షి, జానీమూని వంటి మ‌హిళ‌ల‌ను పిలిచి మాట్లాడి ఉంటే బాగుండేది. ఈ రోజు రాజ‌కీయాల‌కు అతీతంగా స‌ద‌స్సులు పెట్టామ‌ని చెప్పారు. బాబు కోడ‌లు, వెంక‌య్య కూతురు మాట్లాడితేనే మీడియాలో ప్ర‌చారం చేస్తారా. డీజీపీ కూడా టీడీపీ నేత‌ల‌కు వంత పాడ‌టం దారుణం. ఈ రోజు చంద్ర‌బాబు నివ‌సిస్తున్న విజ‌య‌వాడ‌లో అన్యాయాలు, అఘాయిత్యాలు జ‌రుగుతున్నాయి. ఈ పోలీసులు నిద్ర‌పోతున్నారా?  రాష్ట్రంలో జ‌రుగుతున్న మ‌హిళ‌ల స‌మ‌స్య‌లు చెప్పే హ‌క్కు లేదా. ప్ర‌భుత్వ తీరు దుర్మార్గం. కంచే చేను మేస్తున్న‌ట్లు స్పీక‌రే మా హ‌క్కులు కాల‌రాస్తున్నారు. తెలుగు దేశం గుండాల చేతిలో మేం బ‌లై పోతున్నాం. ఆ స‌భ‌లో మాట్లాడి ఆ స‌భ నుంచి బ‌య‌ట ప‌డ‌గ‌ల‌మా? 

  మ‌న రాష్ట్రంలో మ‌నం క‌ట్టిన డ‌బ్బుల‌తో ఏర్పాటు చేసిన స‌భ‌లో మ‌నం పాల్గొనే హ‌క్కు లేదా. ఆ స‌ద‌స్సులో 10 వేల మంది పిల్ల‌ల‌ను తీసుకెళ్లారు. ప‌శువులను ట్ర‌క్కుల్లో తీసుకెళ్లిన‌ట్లు తీసుకెళ్తున్నారు. బాబుకు ఈ స‌దస్సు నిర్వ‌హించే నైతిక హ‌క్కు లేదు. డ‌బ్బుల‌తో ఆడ‌వాళ్ల మాన‌ప్రాణాలు కొన‌వ‌చ్చు అనే ఛీఫ్ మినిస్ట్రీర్ చంద్ర‌బాబు. ఈ రోజు స్టేజ్ మీదా చంద్ర‌బాబు, వెంక‌య్య‌, స్పీక‌ర్ ఫొటోలు ఉన్నాయి. క‌నీసం ఒక్క మ‌హిళా ఫోటో కూడా పెట్ట‌లేదు. గిరిజ‌న మ‌హిళ‌ల‌పై గౌర‌వం లేదు. అసెంబ్లీలో  మాట్లాడితే రూల్స్‌కు విరుద్ధంగా సస్పెండ్ చేసే వీళ్లు రేపు అమ‌రావ‌తిలో ఏ అంశంపై మాట్లాడితే మాకు ర‌క్ష‌ణ ఏదీ. మా ప్రాణాలు కాపాడే గ‌న్‌మెన్‌ను దించేశారు. న‌న్ను చంపేయ‌ర‌నే గ్యారంటీ ఏంటీ. నేనే 
  చ‌నిపోతే నా పిల్ల‌ల‌కు దిక్కెవ‌రు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఒక మ‌గాడు. టీడీపీలో నాకు అన్యాయం జ‌రిగితే ఆ రోజు నాకు భీక్ష పెట్టారు. నా కొడుకు చావు బ‌తుకుల్లో ఉంటే బాబు ఎన్నిక‌ల కోసం న‌న్ను ప్ర‌చారంలో వాడుకున్నారు. ఎంత మ‌హిళా వ్య‌తిరేకో చూడండి. మీకు అనుకూలంగా తీర్పు వ‌స్తే కోర్టులు గొప్ప‌వి. నాకు అనుకులంగా తీర్పు వ‌స్తే లెక్క చేయ‌రా. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చ‌య్య‌, బోండా ఉమా కంటే ఏమైనా ఎక్కువ మాట్లాడానా? ఈ రోజు ఒక ఎమ్మెల్యేకే ర‌క్ష‌ణ లేక‌పోతే. మాములు మ‌హిళ‌లు ఏవిధంగా బ‌త‌క‌గ‌ల‌రు. 

  నిన్న క‌ర్నూలులో ఓ మ‌హిళ‌పై అత్యాచారం జ‌రిగితే ఏం చేశారు. ప్ర‌తి అరాచ‌కం వెనుక టీడీపీ నేత‌లే ఉన్నారు. రాజ‌ధానిలో అసెంబ్లీ స‌మావేశాలు జిర‌గితే ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌కు ర‌క్ష‌ణ  ఉండ‌దు. ఎమ్మెల్యేల హ‌క్కుల‌ను కాల‌రాస్తున్న తీరు చ‌రిత్ర‌లో ఎక్క‌డ లేదు. ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకోవాలి. ఇలాగే మౌనంగా ఉంటే ఒక్క శాతం కూడా మ‌హిళా సాధికారిక‌త సాధ్యం కాదు. ఇవాళ డ్వాక్రా సంఘాల‌ను నిర్వీర్యం చేశారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ను ఎత్తేశారు. క‌నీసం సామాజికంగా గౌర‌వం లేదు, ర‌క్ష‌ణ లేదు. ఏం సాధికార‌త సాధిస్తారు. ఇలాంటి సీఎం ఉండ‌టం సిగ్గు చేటు. ప్ర‌తిప‌క్ష మ‌హిళ‌లు, సామాన్యులు ఎలా న‌లిగిపోతున్నారో ఆలోచించండి. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ‌, బృందాక‌ర‌త్ వంటి మ‌హిళా నేత‌ల‌ను ఎందుకు పిలువ‌లేదు. ఇదేమైనా టీడీపీ మ‌హానాడా? ప‌్ర‌జ‌లే వీరికి గుణ‌పాఠం చెప్పాలి. బాబు ఈ రెండేళ్ల పాల‌న‌లో మ‌హిళ‌ల‌పై జ‌రిగిన అన్యాయాలు, అక్ర‌మాల‌పై రాయాలంటే పెద్ద గ్రంధ‌మే కావాలి. మ‌హిళ‌ల‌పై జరిగిన దాడులు, త‌న‌పై పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును వివ‌రిస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తున్నాం. మీ త‌ల్లి మీదా, చెల్లి మీదా ప్రేమ ఉంటే ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించండి. మ‌హిళ‌ల హ‌క్కులను కాపాడండి.
Back to Top