రౌడీయిజానికి రాజ‌ధాని కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చారు

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజదాని ప్రాంతాన్ని రౌడీయిజానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుస్తున్నాడని ఎమ్మెల్యే రోజా ఫైరయ్యారు. మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడుతూ దేశమంతా ఒక చట్టం అమలులో ఉంటే రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు ప్రత్యేక చట్టం అమలులో ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తప్పు చేసి సారీ చెబితే సరిపోదు, ఐఏఎస్‌ అధికారిపై దాడి చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. అధికారి విధులకు ఆటంకం కలిగించినందుకు నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టినప్పుడు, ఇలాంటి ఘటనలపై ఎలాంటి కేసులు పెట్టాలని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరి చేస్తే తన పార్టీ నేతలు రాష్ట్రంలో ఎలాంటి దౌర్జన్యాలు, అరాచకాలు, రౌడీయిజానికి పాల్పడినా చర్యలుండవు అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చేలా ఉన్నాడని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోనేమో ప్రపంచమంతా నా దగ్గర లాండర్‌ ఆర్డర్‌ ఎలా అమలు చేయాలో నేర్చుకుంటుందంటూ నీతులు చెప్పే చంద్రబాబు బయటకొస్తే ఎంపీలు, ఎమ్మెల్యేల రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రతిపక్షనేతలు, అధికార యంత్రాంగం రాజధాని ప్రాంతానికి రావాలంటే భయపడే రోజులు దాపరించాయన్నారు. సీఎం అంటే చీఫ్‌ మినిస్టర్‌కాదు ఛీప్‌ మినిస్టర్‌ అనే రీతిలో వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని, దాడులకు బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Back to Top