బాబు సిగ్గుమాలిన రాజకీయాలకు నిదర్శనం

హైదరాబాద్‌: బడ్జెట్‌ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై చర్చ జరగాలని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ అడిగితే ఆ చర్చకు జరగకుండా పారిపోయిన టీడీపీ హోదా వల్ల ఏం లాభం.. అద‌నంగా ఏం వస్తుందని అనడం చంద్రబాబు సిగ్గుమాలిన రాజకీయాలకు నిదర్శనం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. హోదా వల్ల ఏం ఉపయోగం లేకుంటే ఎందుకు అసెంబ్లీలో రెండు సార్లు తీర్మాణం  చేశావని చంద్రబాబు ప్రశ్నించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా... నీ పనుల మీద చీకట్లో  కేంద్ర మంత్రుల కాళ్లు పట్టుకోవడానికి వెళ్లిన చంద్రబాబు హోదా కోసం 22 సార్లు వినతిపత్రాలు ఇవ్వడానికి వెళ్లానని అనడం దుర్మార్గమన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేకపోతే పది కాదు.. 15 సంవత్సరాలు కావాలని ఎందుకు అడిగావని రోజా చంద్రబాబును నిలదీశారు. హోదా వల్ల ప్రయోజనాలేంటో ఉత్తరాఖాండ్, హిమాచల్‌ ప్రదేశ్‌లకు వెళ్తే తెలుస్తుందని చురకంటించారు. ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టిన మీ పార్టీ నేతలు సుజనాచౌదరి, గల్లా జయదేవ్, ఆంజనేయులు, సీఎం రమేష్‌లను అడిగితే తెలుస్తుందన్నారు.

Back to Top