రైతుల్ని ప‌క్క‌న పెట్టి స‌మావేశాలా..ప్ర‌భుత్వానికి సూటి ప్ర‌శ్న‌..!

రాజ‌ధాని ప్రాంతంలో రైతుల్ని ప‌క్క‌న పెట్టేసి అవ‌గాహ‌న స‌మావేశాలు ఏర్పాటు చేసుకొంటున్నార‌ని ప్ర‌తిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌ద‌ల‌చుకొంటే రాజ‌ధాని ప్రాంతంలోనే గ్రామాల్లో స‌మావేశాలు ఏర్పాటుచేయాల‌ని డిమాండ్ చేశారు. రైతుల‌కు ఇచ్చిన హామీల‌ను ఏమాత్రం ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌లేదని ఆయ‌న పేర్కొన్నారు. గ్రామాల్లోకి వెళితే రైతులు నిల‌దీస్తార‌ని భ‌య‌ప‌డుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అందుకే విజ‌య‌వాడ‌లో మీటింగ్ లు పెట్టి, త‌మ‌కు అనుకూల‌మైన వారిని మాత్ర‌మే ర‌ప్పించి స‌మావేశాలు అయ్యాయి అనిపిస్తున్నార‌ని చెప్పారు. ప్ర‌భుత్వానికి నిజంగా చిత్త శుద్ధి ఉంటే రైతుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి సమావేశాలు పెట్టి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆర్కే కోరారు. 
Back to Top