ఇది ప‌న్నుల రాజ‌ధాని-ఎమ్మెల్యే ఆర్కే

హైద‌రాబాద్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు నిర్మిస్తున్న రాజ‌ధాని ప్ర‌జ‌ల రాజ‌ధాని కాద‌ని, ప‌న్నుల రాజ‌ధాని అని అభివ‌ర్ణించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామ‌క్రిష్ణ రెడ్డి. అసెంబ్లీ లో ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మంలో రాజ‌ధాని పేరుతో ప్ర‌భుత్వం చేస్తున్న అరాచ‌కాల మీద ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్రస్తావించారు. నిరుపేద‌ల్ని భ‌యపెట్టి, ప్ర‌లోభ పెట్టి లాక్కొన్న భూముల్ని ప్రైవేటు కంపెనీలు, బినామీ సంస్థ‌ల‌కు 99 ఎక‌రాల‌కు క‌ట్ట‌బెడుతున్నార‌ని ఆరోపించారు. నిర్మాణాలు, వినియోగాలు.. ఆఖ‌రికి డిజైన్లు కూడా ప్రైవేటుప‌రం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారని. ఇది ప‌న్నుల రాజ‌ధాని అవుతుంద‌ని వివ‌రించారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం పున‌రాలోచించి ప్రైవేటు సంస్థ‌ల‌కు స‌మ‌స్తం దోచిపెట్టే విధానాలు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. 

తాజా వీడియోలు

Back to Top