వివాహ వేడుకల్లో పాల్గొన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

పెదగార్లపాడు (దాచేపల్లి) : మండలంలోని పెదగార్లపాడు గ్రామానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వచ్చారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేత బి. మంగిరెడ్డి కుమారులు ప్రసాద్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిల వివాహం ఆదివారం రాత్రి జరిగింది. వేడుకల్లో ఆర్కే పాల్గొని నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. అనంతరం పార్టీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి ముత్యం చెన్నారెడ్డి నివాసానికి వెళ్లారు. చెన్నారెడ్డి ఇంట్లో అల్పహారాన్ని స్వీకరించి నాయకులతో కాసేపు మాట్లాడారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Back to Top