ఎమ్మెల్యే ఆర్కే అరెస్టు

గుంటూరు: ప‌్ర‌జాస్వామ్య‌యుతంగా బంద్ పాటిస్తున్న వైయ‌స్సార్సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసుల్ని ఉసిగొలుపుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బస్స్టాండ్ వద్ద బంద్ పాటిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఆర్కేతోపాటు తొమ్మిది మంది పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపుతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులోభాగంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు ఈ రోజు తెల్లవారుజాము నుంచే బంద్ కార్య‌క‌లాపాల‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బంద్కు సహకరించాలని కోరుతూ పట్టణంలో స్థానిక యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.

Back to Top