తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష

చిన్నమండెం(రాయచోటి రూరల్‌): చిన్నమండెం మండల వ్యాప్తంగా ఉన్న 13గ్రామపంచాయతీల్లో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సభాభవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటగా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, పెద్దల నుంచి ఏఏ గ్రామాల్లో ఎలాంటి తాగునీటి ఇబ్బందులు ఉన్నాయో అన్న విషయాలు తెలుసుకున్నారు. ఆ సమస్యలన్నీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీ మాజీ వైఎస్‌ చైర్మన్‌ దేవనాథరెడ్డి, జడ్పీటీసీ కుటుంబ సభ్యులు కంచంరెడ్డిలతో కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సమ్యలున్న చోట 24గంటల్లో సమస్యలను పరిష్కరించి, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో పల్లెల్లో పర్యటించి తాగునీటి సరఫరాపై నిఘా పెట్టాలని చెప్పారు. ఈ రెండు నెలలు తప్పకుండా కష్టపడి పని చేసి ప్రజల ఇబ్బందులు తీర్చాలని కోరారు. 

రెండు నెలల పాటు ప్రతి రోజూ తాగునీటి సమస్యలపై సమీక్షిస్తా :– గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే
ఈ వేసవి రెండు మాసాలు పూర్తిగా ప్రతి రోజూ ప్రజల తాగునీటి సమస్యలపైనే సమీక్షిస్తానని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలంలో తిరిగి అధికారులతో, ప్రజలతో సమీక్షలు జరుపుతానని చెప్పారు. తాగునీటి కోసం ఏ ఒక్కరూ ఇబ్బంది పడుకూడదని , తాగునీటి సమస్యలు పరిష్కరించి, శాశ్వత తాగునీటి పరిష్కారాలను సిద్దం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

నీరు–చెట్టు పనులకు బిల్లులు ఇచ్చి... ఉపాధి కూలీలకు మూడు నెలలు అయినా బిల్లులు రాకపోవడం దారుణం
యంత్రాలలో తూతూ మంత్రంగా పని చేసే నీరు–చెట్టు పనులకు మాత్రం ఈ ప్రభుత్వం రెండు రోజుల్లోనే బిల్లులు ఇస్తుంది. కానీ గడ్డపార చేతి పట్టి, మండుటెండల్లో పని చేసే కూలీలకు మాత్రం ఉపాధి బిల్లులు 3నెలలుగా ఇవ్వకపోవడం దారుణమని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఈ నెలాఖరులకు ఉపాధి కూలీలకు పెండింగ్‌ బిల్లులు వచ్చే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలు వురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Back to Top