నీటిని విడుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలువైయస్‌ఆర్‌ జిల్లా: సర్వరాయసాగర్‌కు నీటిని విడుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గండిపేట నుంచి సర్వరాయసాగర్‌కు నీరు విడుదల చేయాలని కోరుతూ రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా కడప జిల్లా కలెక్టరేట్‌ వద్ద రైతులతో మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజద్‌బాషా, మాజీ మంత్రి వైయస్‌ వివేకానంద్‌రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబులు పాల్గొన్నారు. నీటిని విడుదల చేస్తామని కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 25వ తేదీలోగా నీరు విడుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. 
Back to Top