ఇది ప్ర‌జాస్వామ్య‌మా? నియంత పాల‌నా?

- వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి
హైద‌రాబాద్‌:  రాష్ట్రంలో చంద్రబాబు పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఇది ప్ర‌జాస్వామ్య‌మా?  నియంత పాల‌నా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం పోరాడే వారందరినీ అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజా ఉద్యమాలను అణచి వేయాలనుకోవడం దారుణమని, ఆర్టీసీ ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తులు, బినామీలకు దారాదత్తం చేస్తున్నారని, ఆర్టీసీ ఆస్తులను తెగనమ్మే అధికారం మీకెక్కడిది? అని చంద్రబాబును రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు.

Back to Top