నీటిని విడుద‌ల చేయ‌క‌పోతే నిరాహార దీక్ష‌- గండికోట నుంచి నీరు విడుదల చేయాలని కోరుతూ పాద‌యాత్ర‌


వైయ‌స్ఆర్ జిల్లా:  గండికోట ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని స‌ర్వ‌రాయ సాగ‌ర్ విడుద‌ల చేయ‌పోతే క‌లెక్ట‌రేట్ వ‌ద్ద నిరాహార దీక్ష చేప‌డుతాన‌ని వైయ‌స్ఆర్‌సీపీ క‌మ‌లాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చ‌రించారు. సాగునీటిని స‌ర్వ‌రాయ‌సాగ‌ర్‌కు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ  ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి సర్వరాయసాగర్‌ నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈయన పాదయాత్రకు కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, మేయర్‌ సురేష్‌బాబులు సంఘీభావం తెలిపారు. ప్రాజెక్టు నుంచి మూడు రోజులపాటు పాదయాత్ర కొనసాగనున్నది. ఇతర జిల్లాల్లో అన్ని పార్టీల నాయకులు నీళ్ల కోసం పోరాడుతుంటే ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులే అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర ముగిసేలోగా నీటిని విడుదల చేయకపోతే రైతులు తిర‌గ‌బ‌డుతార‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం స్పందించి నీటిని విడుద‌ల చేయాల‌ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
Back to Top