హైదరాబాద్) అసెంబ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమం సందర్భంగా విద్యుత్ సౌకర్యాల ప్రస్తావన వచ్చింది. దళితుల విషయంలో ఊరట కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా దళితుల ఇళ్ల కు రూ. 50 దాకా ఉచిత విద్యుత్ కల్పిస్తున్నారని గుర్తు చేశారు. దీన్ని గుర్తించేందుకు మీటర్ లు ఏర్పాటుచేసుకోవాలని చెబుతున్నారని, అయితే ఈ మీటర్లకు అయ్యే ఖర్చును ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి కేటాయించవచ్చని అభిప్రాయ పడ్డారు. దీని వల్ల దళితులకు ఉపయోగం కలుగుతుందని చెప్పారు. పైగా విద్యుత్ వినియోగంలో లోటుపాట్లు తెలుస్తాయని పేర్కొన్నారు. వ్యవస్థకు, వ్యక్తులకు మెరుగయ్యే సూచనలు రవీంద్రనాథ్ రెడ్డి చేయటం జరిగింది.