7న అమరావతిలో ఆమరణ దీక్షవైయస్‌ఆర్‌ జిల్లా: చేనేత కార్మికులకు మూడు నెలలుగా రావాల్సిన పింఛన్‌ బకాయిలను వచ్చే జనవరి 5వ తేదీలోగా పంపిణీ చేయకపోతే 7న అమరావతిలోని సీఎం ప్రయాణించే మార్గంలో ఆమరణ దీక్ష చేపడతానని ప్రొద్దుటూరు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు. జనవరి 5న బకాయిలు చెల్లించకపోతే తన ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.2.40 లక్షలను పంపిణీ చేస్తానని ఆయన ప్రకటించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లు పంపిణీ చేయకుండా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే రెండు రోజులుగా మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. 
 
Back to Top