2019లో వైయస్‌ఆర్‌సీపీకే ప్రజలు పట్టం

 

అనంతపురం: 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే ప్రజలు పట్టం కడుతారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ..సుదూరపు బాటసారి వైయస్‌ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. దారిపొడువునా ప్రజా సమస్యల వెల్లువలా వస్తున్నాయని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ భవిష్యత్తులో అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలే చెబుతున్నారని వివరించారు. టీడీపీ లాగా అమలుకు సాధ్యం కాని హామీలు వైయస్‌ జగన్‌ ఇవ్వడం లేదని చెప్పారు. 45 సంవత్సరాలకు పింఛన్‌ ఇవ్వడం ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని పెన్షన్‌ పథకం ప్రకటించామన్నారు. దీనిపై టీడీపీ రాద్దాంతం చేయడం సరికాదన్నారు.  మేం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. టీడీపీకి ఓట్లు వేయలేదని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో  చేనేత పింఛన్లు 75 నిలుపుదల చేశారన్నారు. ఇందుకోసం తాను రెండు రోజుల పాటు దీక్ష చేసినట్లు రాచమల్లు తెలిపారు.
 
Back to Top