ఉక్కు పరిశ్రమ కోసం ఎమ్మెల్యే రాచమల్లు దీక్ష

వైయస్‌ఆర్‌ జిల్లా: కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ప్రొద్దుటూరు రామేశ్వరం నుంచి శివాలయం సెంటర్‌లో రాచమల్లు 48 గంటల దీక్ష ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
 
Back to Top