'తెలుగు యాత్రికుల పట్ల ప్రభుత్వం ఉదాసీనత'

హైదరాబాద్, 17 జూన్‌ 2013:

ఉత్తరాఖండ్‌ వరదలలో చిక్కుకుపోయిన తెలుగువారిని ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమా‌ర్‌రెడ్డి విమర్శించారు. అన్న పానీయాలు లేక బాధితులంతా అలమటిస్తున్నా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. సోమవారంనాడు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణం చర్యలు తీసుకుని ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయిన మన రాష్ట్ర వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రసన్నకుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.

‌ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కూడా బాధితుల విషయంలో కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారని ప్రసన్న ఆవేదన వ్యక్తం చేశారు.

భారీ వర్షాలకు అతలాకుతలమైపోయిన ఉత్తరాఖండ్‌లో మన రాష్ట్రానికి చెందిన వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. గంగ, భగీరథి తదితర నదులకు వరదలు పోటెత్తడంతో ఆ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. ఈ పరిస్థితుల్లో గంగోత్రి, యమునోత్రి యాత్రలకు మన రాష్ట్రం నుంచి వెళ్ళిన వందలాది మంది యాత్రికులు ఉత్తరకాశి అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

తాజా వీడియోలు

Back to Top