ఎమ్మెల్యే పిన్నెల్లి ప‌రామ‌ర్శ

మాచ‌ర్ల‌:

పట్టణంలోని 9వ వార్డులో అనారోగ్యానికి గురైన రెండు కుటుంబాలను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం పరామర్శించారు. వైయ‌స్‌ఆర్‌ అభిమాని మామిళ్ళపల్లి ప్రభుదాసు,జి పూర్ణచంద్రరావును ఆయ‌న‌ పరామర్శించారు.  9వ వార్డుకు వెళ్ళి ముందుగా ప్రభుదాసు ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూర్ణచంద్రరావును సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..వీరు త్వరగా కోలుకోవాలని, ఇబ్బంది ఉంటే తన వంతు సహాయ సహకారాలందిస్తానని పిఆర్కే హామీ ఇచ్చారు.  ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు బండారు పరమేశ్వరరావు, జూలకంటి వీరారెడ్డి, తురకా కిశోర్, ఎం.ఎస్‌.ఆర్, ఆర్‌కె, చల్లా కాశయ్య, చల్లా శ్రీను, రామిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

Back to Top