ప్రాజెక్టుల‌లో 6వేల కోట్ల అవినీతి :ఎమ్మెల్యే పెద్దిరెడ్డి


చిత్తూరు) నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌లో రూ. 6వేల కోట్ల మేర అవినీతి జ‌రిగింద‌ని వైఎస్సార్సీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వెల్ల‌డించారు. హంద్రీనీవా, గాలేరు న‌గ‌రి ప్రాజెక్టు ప‌నుల్లో అవినీతి రాజ్య‌మేలుతోంద‌ని మండిప‌డ్డారు. చిత్తూరు జిల్లా సోమ‌ల మండలం నంజంపేట‌లో ప‌ల్లె బాట కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హించారు. ఇప్పుడు ప‌ట్టిసీమ ప‌థ‌కం పేరుతో రాయ‌లసీమ ప్ర‌జ‌ల్ని మోసం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. దీని ద్వారా నీళ్లు వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌ట్టిసీమ‌లో రూ. 500 కోట్లు దాకా తినేశార‌ని ఆరోపించారు. 
రాష్ట్రంలో అవినీతి విల‌య తాండ‌వం చేస్తోంద‌ని చెప్పారు.  చంద్రబాబుకు అమరావతి మినహా మరేమీ కనిపిం చడం లేదని ఆయ‌న అన్నారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. రైతుల నుంచి 30 వేల ఎకరాలు లాక్కుని టీడీపీ నేతలు పంచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో చం ద్రబాబు ప్రజలను ఆకట్టుకునేందుకు అమలు సాధ్యంకాని హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాగ్దానాలను మరచిపోయారని మండిపడ్డారు.
Back to Top