బాబును ప్రజలే ఇంటికి పంపిస్తారు

 
చిత్తూరు: అధికారం కోసం 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాలుగేళ్లలో ఏ ఒక్కటీ కూడా సక్రమంగా నెరవేర్చలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబును ప్రజలే ఇంటికి పంపిస్తారని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్న సొంత జిల్లా చిత్తూరుపై చిన్నచూపే అని విమర్శించారు. గతంలో చక్కెర పరిశ్రమలు మూత వేయిస్తే..వాటిని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తెరిపించి రైతులకు అండగా నిలిచారన్నారు. చంద్రబాబు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్‌ కోసం చిత్తూరు డైరీ, విజయ డైరీలను మూత వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు సాగు నీరు తీసుకురాలేని చంద్రబాబు వైయస్‌ఆర్‌ జిల్లాలో గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 85 శాతం పూరై్తన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తిన చంద్రబాబు ఆ క్రెడిట్‌ అంతా తనదే అని చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. జన్మభూమి సభలను టీడీపీ సొంత కార్యక్రమంలా నిర్వహించుకోవడం బాధాకరమన్నారు.  వైయస్‌ జగన్‌ సీఎం కాగానే చిత్తూరు డైరీ, విజయడైరీలకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు చిత్తూరు జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పెద్దిరెడ్డి చెప్పారు.
 
Back to Top