జీడీ నెల్లూరును బాబు విస్మరించారు


చిత్తూరు:  గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మరించారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్ర జీడీ నెల్లూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జననేత వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు. నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్‌ కాలేజీలు ఏర్పాటు చేయలేదన్నారు. చంద్రబాబు నాలుగేళ్లుగా ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మా దురదృష్టమన్నారు. ఎప్పుడు సీఎం అయినా కూడా చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని రైతులు చెరుకు పంట సాగుపై ఆధారపడ్డారని, వైయస్‌ జగన్‌ వస్తున్నారని, మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  వైయస్‌ జగన్‌ ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని నారాయణస్వామి కోరారు. 
 
Back to Top