ప్రజల మదిలో వైయస్‌ జగన్‌ చెరగని ముద్రచిత్తూరు: ఆంజనేయస్వామి హృదయంలో ఏ విధంగా శ్రీరాముడు కొలువుదీరాడో.. అదే విధంగా రాష్ట్ర ప్రజల మదిలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానం కల్పించుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లాకు వచ్చిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారన్నారు. ప్రతి గ్రామంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిపై ఉన్న ప్రేమను వైయస్‌ జగన్‌పై చూపిస్తున్నారన్నారు. ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ప్రజా సంకల్పయాత్రను జయప్రదం చేస్తున్నారన్నారు. జననేతను ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఆలోచనలో ప్రజలంతా ఉన్నారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఓటుకు ఎన్ని వేలు ఇవ్వాలని కుయుక్తులు పన్నుతున్నారన్నారు.  వైయస్‌ జగన్‌కు ప్రత్యేక ఆదర అభిమానాలు చూపిస్తున్నారు. ఆంజనేయుడి హృదయంలో రాముడు ఏ విధంగా ఉన్నాడో ప్రజల మదిలో వైయస్‌ జగన్‌ ఆరకంగా ఉన్నాడన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే మాకు ఇండ్లు, పెన్షన్, భూమి వస్తాయని ప్రజలంతా నమ్మకంతో ఉన్నారన్నారు. 
 
Back to Top