ముస్లింలంతా వైయస్‌ఆర్‌సీపీ వెంటే


– జలీల్‌ఖాన్‌ వక్ఫ్‌బోర్డు ఆస్తులు కాజేసే ప్రయత్నం
విజయవాడ: ముస్లింలంతా కూడా వైయస్‌ఆర్‌సీపీ వెంటే ఉన్నారని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ పదవి పొందిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఇవాళ వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఆయనకు ఎమ్మెల్యే పదవి వైయస్‌ జగన్‌ బిక్ష అన్నారు.  జలీల్‌ఖాన్‌ వంటి వ్యక్తిని భగవంతుడు కూడా క్షమించరన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులు కాజేసేందుకు జలీల్‌ఖాన్‌ ప్రయత్నం చేస్తున్నారన్నారు. వక్ఫ్‌ బోర్డుకు ఇదివరకు ఉన్న ఆస్తులకే దిక్కు లేకుండా పోయిందని, టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారన్నారు. చంద్రబాబు చెంచాలా వ్యవహిస్తున్న జలీల్‌ఖాన్‌ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేని చంద్రబాబును మైనారిటీలు నమ్మరన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు పెద్ద పీట వేశారన్నారు. 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు వైయస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. గుంటూరులో అతిసార వ్యాధితో 30 మంది చనిపోతే ఒక్క మాట కూడా మాట్లాడని జలీల్‌ఖాన్‌ పదవుల కోసం పాకులాడుతున్నారన్నారు. ముస్లింలు వైయస్‌ఆర్‌సీపీ వెంటే ఉన్నారన్నారు. టీడీపీ నేతల్లో నీతి, న్యాయం లేదన్నారు. రాష్ట్రాన్ని దోచుకునే ఉద్దేశ్యం తప్ప మరేమి లేదని విమర్శించారు. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు బంగాళఖాతంలో కలిసి పోతారన్నారు. టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్ర ప్రజల కోసం నాలుగేళ్లుగా ఉద్యమిస్తున్నారని గుర్తు చేశారు. 
 
Back to Top