టీడీపీ విషప్రచారం

గుంటూరుః వైయస్సార్సీపీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడ గీత దాటరన్నది వాస్తవమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. 16 మంది వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ టీడీపీ విష ప్రచారం చేస్తోందని ముస్తఫా మండిపడ్డారు. ప్రజలు, కార్యకర్తల మనోభావాన్ని తీసుకొని ముందుకెళ్తామని అన్నారు. రాబోయే కాలంలో నూటికి నూరుపాళ్లు వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నంద్యాలలో ఓడిపోయినంత మాత్రాన వచ్చే నష్టమేమి లేదన్నారు. ఓ వందమంది ఇతర పార్టీల నుంచి  తన సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారని ముస్తఫా తెలిపారు.

Back to Top