క‌రువు జ‌యించామ‌న‌డం సిగ్గుచేటు

తిరుపతి: రాయలసీమలో కరువు విల‌య‌తాండవం చేస్తున్నా ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు పట్టడం లేదని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరువు పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సీమ జిల్లాల్లో తాగునీరు లేక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌న్నారు. వేస‌విలో తాగునీటి వ‌స‌తి క‌ల్పించ‌డంలో చంద్ర‌బాబు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడ‌న్నారు. కరువును జయించామని చంద్రబాబు చెప్పడం​ సిగ్గుచేటని మండిపడ్డారు. నారా లోకేష్ మంత్రి అయినా చిత్తూరు జిల్లాకు జరిగిందేమీ లేదని తెలిపారు.

Back to Top