ఇళ్ల కేటాయింపుల్లో ద‌ళారుల‌దే రాజ్యం

నెల్లూరు: న‌గ‌రంలోని వైయ‌స్ఆర్ న‌గ‌ర్‌ ఇళ్ల కేటాయింపుల్లో ద‌ళారుల‌దే రాజ్యంగా మారింద‌ని నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ల‌బ్ధిదారుల‌కు జ‌రుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ..టీడీపీ నాయ‌కులు పేద‌ల‌ను జ‌ల‌గ‌ల్లా పీడిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇళ్ల కేటాయింపుల కోసం వేల‌కు వేలు క‌మీష‌న్లు లాక్కుంటున్నార‌ని ఫైర్ అయ్యారు. పేద‌ల‌ను పీల్చేసే ద‌ళారుల‌ను చెట్టుకు క‌ట్టేసి కొడ‌తాన‌ని కోటంరెడ్డి హెచ్చ‌రించారు. వైయ‌స్ఆర్‌ న‌గ‌ర్‌లో గ‌తంలో ప‌ట్టాలిచ్చిన పేద‌ల ఇళ్ల‌కు తాళాలు వేయ‌డం అన్యాయ‌మ‌న్నారు.అధికారులు విచారణ పేరుతో పేద‌ల‌ను వేధించ‌డం స‌రికాద‌ని చెప్పారు.. క‌నీసం క్యాంప్ పెట్టిన‌ప్పుడు నీడ కోసం షామీయాన కూడా వేయ‌లేదంటూ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Back to Top