విభజన హామీల అమలులో ప్రభుత్వాలు విఫలం

నెల్లూరు: విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. రామాయ్యపట్నం పోర్టు నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ కావలి బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దుగ్గిరాజుపట్నం పోర్టు విభజన చట్టంలో పెట్టేటప్పుడు ఫీజుబులిటీ ఉందో.. లేదో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదా.. అని ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేయడానికి అడ్డంకి ఏంటని నిలదీశారు. 
Back to Top