ప్యాకేజీ కళ్యాణ్‌..మీ పార్టనర్‌ను ప్రశ్నించు


ఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన మీ పార్టనర్‌ చంద్రబాబును ప్రశ్నించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పవన్‌ కళ్యాణ్‌కు సూచించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తుంటే మమ్మల్ని విమర్శించడం పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞానానికి నిదర్శమన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చిన పవన్‌ కళ్యాన్‌ ఏ నాడు రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాపై ప్రశ్నించలేదన్నారు. హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీనే అని గుర్తు చేశారు. పవన్‌ కళ్యాణ్‌కు ఎలాంటి అనుభవం లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మేం ఈ నెల 21న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై టీడీపీ మద్దతు కూడగట్టాలని పవన్‌కు సూచించారు. ప్రజలను మభ్యపెట్టే విధానాలను విడిచి, ప్రత్యేక హోదా కోసం కలిసి పోరాటం చేయాలని సూచించారు.
 
Back to Top