వైయస్‌ జగన్‌ ప్రకటనలతో బాబు ఉక్కిరిబిక్కిరి

ఏం చేయాలో తెలియక తెరపైకి పార్ట్‌నర్‌ ఎంట్రీ
ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు చంద్రబాబు, పవన్‌ కుట్రలు
ఓటుకు కోట్ల కేసుతో కేంద్ర చేతిలో బాబు కీలుబొమ్మ
విజయవాడ: అన్యాయంగా అంధ్రరాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీకి పట్టినగతే తెలుగుదేశం పార్టీకి కూడా పడుతుందని గుడివాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. అందుకనే చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరలేపారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనలతో చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ జగన్‌ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ప్రకటించడం జరిగిందని, అదే విధంగా అవిశ్వాస తీర్మానం, ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. దీంతో నాలుగేళ్లుగా నాటకాలు ఆడుతున్న చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. తన పార్ట్‌నర్‌ పవన్‌కల్యాణ్‌ను తెరపైకి తీసుకువచ్చి ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 

టీడీపీని మోడీ చేతిలో పెడితే నిధులొస్తాయని, వెంటనే టీడీపీని చంద్రబాబు బీజేపీలో విలీనం చేయాలని కొడాలి నాని సూచించారు. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డాక కేంద్రం చేతిలో చంద్రబాబు కీలుబొమ్మగా మారారన్నారు. చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేదొకటని, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి వైయస్‌ జగన్‌ అని చంద్రబాబులా వైయస్‌ జగన్‌కు వెన్నుపోటు రాజకీయాలు చేయడం రాదన్నారు. కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుకు వెన్నెతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ప్రజల సంక్షేమం బాబుకు పట్టదని, తనకు కావాల్సిందల్లా అధికారమేనన్నారు. అందుకు ఎంతవరకైనా దిగజారుతాడన్నారు. 
 
Back to Top