వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కాకాణి

వెంకటాచలం(సర్వేపల్లి):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని  పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆయనతోపాటుగా వెంకటాచలం మండలం నిడిగుంటపాళేనికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ  జిల్లా సంయుక్త కార్యదర్శి కట్టంరెడ్డి విజయ్‌మోహన్‌రెడ్డి, వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్యను తీసుకెళ్లి జగన్‌మోహన్‌రెడ్డికి పరిచయం చేశారు. వీరిద్దరూ వెంకటాచలం మండలంలో పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని ఎమ్మెల్యే కాకాణి జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు.

Back to Top