సోమిరెడ్డి అవినీతిపై విచారణ జరిపించాలి

నెల్లూరు: మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకుని మంత్రి సోమిరెడ్డి రైతుల పొట్ట కొడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సొమిరెడ్డి వ్యవసాయ శాఖను అవినీతి శాఖగా మార్చాడని మండిపడ్డారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి సోమిరెడ్డిపై ఫైర్‌ అయ్యారు. రైతురథం పేరుతో భారీగా అవినీతికి పాల్పడుతున్నారని, సోమిరెడ్డి అవినీతిపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top