ఇది బోగస్ బడ్జెట్: ఎమ్మెల్యే కాకాని


హైదరాబాద్) ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచినట్లుగానే ప్రజల్ని వెన్నుపోటు
పొడిచేందుకు గాను లోపభూయిష్టమైన బడ్జెట్ ను ప్రవేశ పెట్టారని వైఎస్సార్సీపీ
ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఇది సాంకేతికంగా నేరపూరితం
అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన
మీడియాతో మాట్లాడారు.

నిస్సిగ్గుగా ఇచ్చిన హామీలను మరిచిపోయిన విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ఆయన
అన్నారు. ఏ ఒక్క వాగ్దానం గురించి ఆలోచన చేయటం లేదని కాకాని అన్నారు.  రూ. 87 వేల కోట్ల మేర రైతుల అప్పులు పేరుకొని
పోయి ఉంటే, రుణమాఫీ జరిగిపోయిందని చెబుతారని అన్నారు. తొమ్మిదిగంటల ఉచిత విద్యుత్
అంటూ ప్రజల్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తారని వివరించారు. తొమ్మిది గంటల పగటి
పూట విద్యుత్ అన్నారు . కానీ దాని ఊసే లేదని పేర్కొన్నారు.

 

Back to Top