వైయస్ఆర్‌సీపీలో చేరిన ఎమ్మెల్యే జయమణి

నెల్లిమర్ల (విజయనగరం జిల్లా):

పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీలో చేరారు. నెల్లిమర్లలోని మొయిద జంక్షన్ వద్ద శుక్రవారం నిర్వహించిన‌ వైయస్ఆర్‌ జనభేరి బహిరంగ సభలో పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీ కండువా వేసి ఆమెను సాదరంగా ఆహ్వానించారు. జయమణితో పాటు పార్వతీపురం ఏఎంసీ చైర్మన్ భీమవరపు కృష్ణమూర్తి, సీడీసీ చైర్మన్ నడిమింటి రామకృష్ణ, డీసీసీబీ డెరైక్ట‌ర్ బొంగు చిట్టిరాజు, పార్వతీపురం నియోజకవర్గం నుంచి పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Back to Top