ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు కుట్ర

ఢిల్లీ: రామాయణంలో కుంభకర్ణుడు ఆరు నెలలు మాత్రమే నిద్రపోతాడు కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లుగా నిద్రపోతూనే ఉన్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతుంటే చంద్రబాబు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను సాధించేందుకు వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు రాజీనామాకు కూడా సిద్ధపడ్డారన్నారు. చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే వారి పార్టీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో నాలుగేళ్లుగా ఇద్దరికే ఉద్యోగాలు వచ్చాయని, వారు లోకేష్, నారాయణ అని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి వైయస్‌ జగన్‌ ఒక్కరే పోరాడుతున్నారని, నరేంద్ర మోడీ ప్రభుత్వం మెడలు వంచైనా హోదా సాధిస్తారన్నారు. ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు ఎవరికైనా వచ్చాయంటే అది లోకేష్, నారాయణకు తప్ప ఎవరికీ రాలేదు. 
Back to Top