నవరత్నాలతో ప్రతి కుటుంబానికి లబ్ధికర్నూలు:  నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబానికి లక్షల రూపాయల్లో లబ్ధి చేకూరుతుంద‌ని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. జూపాడుబంగ్లా మండ‌లంలోని 80 బన్నూరు గ్రామంలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని వైయ‌స్ఆర్‌ విగ్రహానికి పూల మాలలువేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిప‌డ్డారు. ప్రత్యేక హోదాకంటే ప్యాకేజీ ముద్దన్న చంద్రబాబు బాబు నేడు కపట రాజకీయాలు చేస్తున్నారన్నారు. అడ్డంగా సంపాదించిన సొమ్ముతో వైయ‌స్ఆర్‌సీపీఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.   

Back to Top