నిజాలను విని జీర్ణించుకునే శక్తి లేదా?

వైయస్‌ఆర్‌ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిజాలు విని జీర్ణించుకునే శక్తి లేదా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. జన్మభూమి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమమా? టీడీపీ కార్యక్రమమా అని నిలదీశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఓ పార్లమెంట్‌ సభ్యుడి మైక్‌ లాక్కొవడం దుర్మార్గమన్నారు.  ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలతో ఎన్నుకోబడిన ఓ రాజకీయ నాయకుడిని మాట్లాడనివ్వకపోవడం దారుణమని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. వార్డు మెంబర్‌ కూడా కానీ టీడీపీ నేతలను ఎందుకు స్టేజీ ఎక్కించారని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని ఓ పార్టీ కార్యక్రమంగా మార్చి, ప్రభుత్వం నుంచి ఇచ్చే పింఛన్లు కూడా వీరి జేబుల్లో నుంచి ఇస్తున్నట్లు బిల్డప్‌ ఇస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాలను రాయలసీమకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తెస్తే..ఆ విషయం అవినాష్‌రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు దిగజారి ప్రవర్తించారన్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ, ఓ ప్రజాప్రతినిధిని అవమానపరిచేలా పబ్లిక్‌గా వ్యవహరించడం, చంద్రబాబు సీఎంగా ఉండటం సిగ్గుపడుతున్నామని విమర్శించారు.
 
Back to Top