ప్రాణం ఉన్నంత వ‌ర‌కు వైయ‌స్ జ‌గ‌న్ వెంటే వైయ‌స్ఆర్ జిల్లా: త‌న‌  ప్రాణం ఉన్నంత వరకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తానని, నీతి మాలిన రాజకీయాలు చేయడం తనకు చేతకాదని వైయ‌స్ఆర్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న ఖండించారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వస్తున్న స్పందన చూసి టీడీపీ నాయకులు భయపడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్‌ సీపీ నుంచి పలువురు బయటికి వెళుతున్నారంటూ దొంగచాటుగా మీడియాలో ప్రచారం చేస్తూ.. అందులో తన పేరు కూడా చేర్చడం దుర్మార్గమని విమ‌ర్శించారు. తనపై అధికార టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలకు ప్రతి సారీ వివరణ ఇచ్చుకోవాలంటే సిగ్గుగా ఉందన్నారు. శ్రీకాంత్‌రెడ్డిని సంప్రదించానని ముందుకు వచ్చి చెప్పే ధైర్యం టీడీపీ నాయకులకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. 

Back to Top