పలువురికి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పరామర్శ

తొండంగి: మండలంలోని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా శనివారం పలువురి కుటుంబాలను పరామర్శించారు. బెండపూడిలోని వైయస్సార్‌సీపీ మండల యూత్‌ కన్వీనర్‌ ఆరుమిల్లి ఏసుబాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలికిగాయాలయ్యాయి. ఈనేపథ్యంలో ఆయనను ఎమ్మెల్యే రాజా, పార్టీ మండల కన్వీనర్‌ బత్తుల వీరబాబు, పప్పల సీతారాముడు, మద్దుకూరి వెంకటరామయ్యచౌదరి తదితరులతో కలిసి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన నమ్మి సతీష్‌ ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతిచెందాడు. ఆయన కుటుంబసభ్యులైన తండ్రి సోమరాజు, సోదరుడు ప్రసాద్, భార్య లోవ, కుమార్తె సుష్మలను ఎమ్మెల్యే రాజా పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం సీతారాంపురంలో వైయస్సార్‌సీపీ నాయకుడు పగడాల నానాజీ సోదరుడు పగడాల శ్రీనివాసరావు మంగళవారం గుండెపోటుతో మరణించాడు. ఈనేపథ్యంలో ఆయన భార్య నాగమణి, కుమార్తెలు, సోదరుడు నానాజీలను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యే వెంట పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, పార్టీ నాయకులు కొయ్యా శ్రీనుబాబు, తొండంగి సొసైటి ఉపాధ్యక్షుడు వనపర్తి సూర్యనాగేశ్వరరావు డైరెక్టర్‌ అంబుజాలపు పెద సత్యనారాయణ, పి.ఇ.చిన్నాయపాలెం ఉపసర్పంచ్‌ దూళ్లిపూడి ఆంజనేయులు, పెండ్యాల బాబి, పెండ్యాల లచ్చరాజు, పెండ్యాల బాబూరావు, పెండ్యాల రామకృష్ణ, బెండపూడి మాజీ సర్పంచ్‌ కోనాల రాముడు, నాగం గంగబాబు, బూసాల గణపతి, బెక్కం చంద్రగిరి, పల్లా లోవరాజు, గొర్ల సోమరాజు, గింజాల గోవిందు, సోము లచ్చారావు, కటకం శివ, గునిమానికల ఏసుబాబు, యడ్ల వెంకటరమణ, పడాల శ్రీను, తదితరులు ఉన్నారు.

Back to Top